బాంబే డైయింగ్ త్రైమాసిక లాభంలో 96శాతం క్షీణత!

by Shyam |   ( Updated:2020-06-10 08:14:02.0  )
బాంబే డైయింగ్ త్రైమాసిక లాభంలో 96శాతం క్షీణత!
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్స్‌టైల్‌ రంగ సంస్థ బాంబే డైయింగ్ 2020 మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 96.1 శాతం క్షీణించి రూ.48.63 కోట్లని వెల్లడించింది. గతేడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,253.37 కోట్లు నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాల నుంచి లాభాలు సహాయపడినట్టు కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 88.76 శాతం క్షీణించి రూ.313.10 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 2,786.36 కోట్లుగా ఉండేది. ఈ త్రైమాసికంలో మొత్తం ఖర్చులు 68.34 శాతం తగ్గి రూ .489.53 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,546.69 కోట్లని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం 73.26 శాతం క్షీణించి రూ.328.85 కోట్లకు పరిమితమైందని కంపెనీ పేర్కొంది. కంపెనీ నికర మార్జిన్స్‌ 15.51 శాతంగా ఉన్నట్టు, మొత్తం ఆదాయం 57.22 శాతం క్షీణించి, రూ.1894.62 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.4429.76 కోట్లుగా నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed