పంజాబ్ కోర్టు లో భారీ బాంబ్ బ్లాస్ట్..

by Sumithra |   ( Updated:2021-12-23 05:07:21.0  )
పంజాబ్ కోర్టు లో భారీ బాంబ్ బ్లాస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్: కోర్టు ఆవరణంలో భారీ బాంబు పేలుడు జరిగింది. పంజాబ్ లోని లుథియానా ఆవరణంలో జరిగిన పేలుడు ధాటికి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గురువారం మధ్యహ్నం 12.30 గంటలకు ఈ పేలుడు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పేలుడు జరిగిన వెంటనే బాంబ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు మొదలు పెట్టింది. పోలీసులు అసలు ఈ బాంబ్ కోర్ట్ ఆవరణంలోకి ఎలా వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. పేలుడు శబ్దం వినిపించడంతో ఒక్కసారిగా కోర్ట్ ప్రాంగణం మొత్తం భయాందోళనకు గురి అయింది.

Advertisement

Next Story