బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలేకు బాలీవుడ్ అగ్ర స్టార్స్..

by Shyam |
Ranveer Singh, Deepika Padukone, Alia Bhatt Ramcharan
X

దిశ వెబ్ డెస్క్: ఇప్పటి వరకు బిగ్ బాస్ 5లో అందరిని పక్కకు నెట్టేసి గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్ల డిసెంబర్‌ 19న తుదిపోరుకు సిద్దమైయారు. తమ అభిమాన కంటెస్టెంట్‌ను ఓట్లేసి గెలిపించడానికి సోషల్ మీడియాను ప్రాథమికంగా తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ 5 లో విజేతను ప్రకటించడానికి పెద్ద స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా బాలీవుడ్ స్టార్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో ముఖ్యంగా రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే, అలియా భట్‌ ఈ గ్రాండ్‌ ఫినాలేకు వస్తున్నట్లు మీమిస్ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్‌ నుంచి మెగా రామ్‌చరణ్‌ కూడా సందడి చేయడానికి వస్తున్నట్లు, అందుకు అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. అదే నిజం అయితే ఇక తెలుగు ప్రేక్షకులకు, కంటెస్టెంట్లకు బిగ్ బాస్ 5 కనుల పండువగా మారనుంది.

Advertisement

Next Story