- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చైన్ స్నాచింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ నటుడు

దిశ, వెబ్ డెస్క్: ఒంటరిగా ఉన్న మహిళల వద్ద చైన్ స్నాచింగ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు ఒక బాలీవుడ్ నటుడు. క్రికెట్ బెట్టింగ్ ల వలన అప్పులపాలైన నటుడు మరో స్నేహితుడితో కలిసి దొంగతనం చేస్తూ గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు. మిరాజ్ కపాడి బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్లో నటిస్తున్నాడు. అయితే ఇతనికి క్రికెట్ బెట్టింగ్స్ అంటే పిచ్చి. దీంతో తనకు వచ్చే డబ్బునంతా బెట్టింగ్స్ లో పెట్టి అప్పులపాలయ్యాడు. ఎంతోమందిని అప్పు అడిగి విసిగిపోయిన మిరాజ్ తన స్నేహితుడు, బాడీ బిల్డర్ అయిన వైభవ్ జాదవ్ తో కలిసి చైన్ స్నాచింగ్ చేయడం మొదలుపెట్టారు.
ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్ గా పెట్టుకొని వారి మెడలోని గొలుసులను చోరీ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సూరత్ లో చోరీలు ఎక్కువ కావడంతో వాటిపై దృష్టి పెట్టిన పోలీసులు విచారణ ముమ్మురం చేశారు. రెండు రోజుల క్రితం పక్కా సమాచారంతో మిరాజ్, జాదవ్ ని పోలీసులు పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.