సుశాంత్ ఇంట్లో పార్టీ.. అందులో ‘బేబి పెంగ్విన్’ : కంగనా

by Shyam |   ( Updated:2020-07-31 20:52:25.0  )
సుశాంత్ ఇంట్లో పార్టీ.. అందులో ‘బేబి పెంగ్విన్’ : కంగనా
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తప్పకుండా న్యాయం జరగాల్సిందేనని.. అప్పటివరకు ఎవరినీ వదిలేది లేదంటోంది. ఈ క్రమంలోనే మరోసారి రెచ్చిపోయిన కంగనా ఈ సారి ఏకంగా సీఎం కుమారుడిని టార్గెట్‌ చేశారు. బేబీ పెంగ్విన్‌ అంటూ తనదైన స్టైల్‌లో విమర్శలు చేశారు.

సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో మరోసారి కంగన సోషల్‌ మీడియాలో స్పందించింది. ఆత్మహత్య చేసుకునే ముందు రోజు రాత్రి సుశాంత్‌ ఇంట్లో పార్టీ జరిగిందని కంగన చెప్పుకొచ్చింది. అందులో ఇందులో ఓ ప్రముఖ వ్యక్తి కూడా పాల్గొన్నాడన్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనాలకు తెరతీస్తున్నాయి.

‘ప్రతీ ఒక్కరికి ఈ విషయం తెలుసు.. కానీ, ఎవరూ అతని పేరు మాత్రం చెప్పరు.. కరణ్‌ జోహార్‌ ప్రాణ స్నేహితుడు, గొప్ప సీఎం కొడుకు.. ఆయన్ను అంతా ప్రేమగా బేబీ పెంగ్విన్‌ అని పిలుస్తారు.. ఒకవేళ నేను నా ఇంట్లో ఉరేసుకుని కనిపిస్తే.. దయచేసి అది ఆత్మహత్య అని భావించోద్దని కంగన చెప్తుంది’ అంటూ ఆమె టీం ట్వీట్ చేసింది.

ఇక్కడ ఆమె చెప్పిన బేబీ పెంగ్విన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరే అని అందరికీ తెలిసిందే. ఈ మధ్య కొందరు నెటిజన్లు బేబీ పెంగ్విన్ అంటూ ఆదిత్యను సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు కంగన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే కొందరు కంగన ధైర్యాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. మీకు ఉన్న ధైర్యం చాలా మందికి లేదు.. అందుకే మీరు ధైర్యంగా పేరు చెప్పారంటూ మెచ్చుకుంటున్నారు. మొత్తానికి కంగన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీ టౌన్‌లో సంచలనం రేపుతున్నాయి.

Advertisement

Next Story