బాలీవుడ్‌లో విషాదం.. సంగీత దర్శకుడు మృతి

by vinod kumar |
బాలీవుడ్‌లో విషాదం.. సంగీత దర్శకుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. అయితే కరోనా కారణంగా ఎంతో మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, నటులు ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా కాటుకి బాలీవుడ్ లో మరో ప్రముఖ సంగీత దర్శకుడు గురువారం రాత్రి మృతి చెందాడు. బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) ఇటీవల కరోనా సోకింది. దీంతో అతని ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్ ఎల్ రహేజా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడని ఆయన కుమారుడు సంజీవ్ వెల్లడించారు.

Advertisement

Next Story