వారితో పడుకుంటేనే అవకాశాలు.. అగ్గిరాజేస్తున్న స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-08-08 03:21:36.0  )
వారితో పడుకుంటేనే అవకాశాలు.. అగ్గిరాజేస్తున్న స్టార్ హీరోయిన్ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమం ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతోమంది ప్రముఖులను రోడ్డుకు లాగింది. ఇంకొంతమందిని జైలుకు పంపింది. మరికొంతమందిని కోర్టు మెట్లెక్కేలా చేసింది. ఇప్పటికీ హీరోయిన్లకు కొన్నిచోట్ల లైంగిక వేధింపులు తప్పడం లేదు. సమయం వచ్చినప్పుడల్లా తమ జీవితంలో ఎదుర్కున్నసంఘటనలను హీరోయిన్లు బయటపెడుతూ వస్తూనే ఉన్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటి తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తనకు ఎందుకు సినిమాల్లో అవకాశాలు రాలేదో వివరించింది.

నర్గీస్ ఫక్రీ.. బాలీవుడ్ లో ‘రాక్ స్టార్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటూ బిజీ గా మారిపోయింది. ఇక తాజాగా ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళవుతున్నా తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం.. తాను ఎవరికి కమిట్ మెంట్ ఇవ్వకపోవడమేనని తెలిపింది.

“సినిమాలో నటించాలి అనుకున్నప్పటినుంచి నేను కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాను. ఈ నియమాల వలనే నేను ఎన్నో అవకాశాలను కోల్పోయాను. అవకాశం కావాలంటే నిర్మాతలు, డైరెక్టర్లతో పడుకోవాలి.. వారి కోరిక తీర్చాలి.. నగ్నంగా కనిపించాలి.. అలా అయితేనే అవకాశాలు వస్తాయి అనుకుంటే.. ఆ అవకాశాలు నాకు వద్దు అని తిరస్కరించాను. వారి పక్కలో పడుకునేందుకు నిరాకరించడం కారణంగానే నేను ఎన్నో సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పేరుకోసమో, డబ్బు కోసమో ఏ దర్శకుడి లైంగిక డిమాండ్లకు తలొగ్గలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఆరోపణలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ అమ్మడి ని అంతలా హింసించిన డైరెక్టర్లు ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారంట..

Advertisement

Next Story