డ్రగ్స్ కేసు లో పట్టుబడ్డ 'ఆది' హీరోయిన్..

by Sumithra |   ( Updated:2021-06-15 00:55:57.0  )
naira nehal shah arrested
X

దిశ, వెబ్‌డెస్క్: బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలతో బాలీవుడ్ యువనటి నైరా నేహాల్‌ షాతోపాటు ఆమె స్నేహితుడు అశిక్‌ సాజిద్‌ హుస్సేన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో నటి తన స్నేహితులతో కలిసి పార్టీలో డ్రగ్స్ తీసుకొంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేశారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన నటి నైరా నేహాల్‌ షాతో పాటు ఆమె స్నేహితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వేడుకకు గోవాకు చెందిన తన స్నేహితుడు ఆశిక్ హుస్సేన్ హాజరయ్యాడు. వీరిద్దరూ డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు నిర్దారణ కావడంతో వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ బెయిల్ లభించిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నైరా నేహాల్‌ షా బాలీవుడ్ సినిమాలతో పాటు రెండు తెలుగు చిత్రాల్లోను నటించింది. ఆది సాయి కుమార్ నటించిన ‘బుర్రకథ’ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది.

Advertisement

Next Story