పైజామాలకు గుడ్‌ బై చెప్పిన బీటౌన్ హీరోయిన్

by Jakkula Samataha |   ( Updated:2021-06-15 05:28:42.0  )
boomi-pednekar 1
X

దిశ, సినిమా : ఫిల్మ్ షూటింగ్స్‌ స్టార్ట్ కావడం పట్ల బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఆనందం వ్యక్తం చేసింది. ముంబైలో నిబంధనలకు లోబడి సినిమాల చిత్రీకరణ చేసేందుకు అనుమతించగా.. అప్‌కమింగ్ మూవీ ‘రక్షాబంధన్’ షెడ్యూల్స్ పూర్తి చేసేందుకు ముంబైకి చేరుకుంది భూమి. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరి కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడాన్ని ప్రశంసించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో.. ‘బై బై పైజామాస్, లైఫ్ రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నా. షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మహారాష్ట్రలో అన్‌లాకింగ్ ప్రక్రియ మొదలైన వెంటనే షూటింగ్ మొదలవుతుండటం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.

ఇక వ్యాక్సినేషన్ డ్రైవ్ కొవిడ్ రిస్క్‌ను తగ్గిస్తుందని చెప్పిన భూమి.. రోజువారీ సినీ కార్మికులకు పనికల్పించడంతో వారి కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని తెలిపింది. కాగా ఇండస్ట్రీ లీడర్స్ ఆదిత్య చోప్రా, ఫర్హాన్ అక్తర్, కరణ్ జోహార్.. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించడాన్ని కొనియాడింది. ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అంతా సన్నిహిత వాతావరణంలో పనిచేస్తారు కాబట్టి, సేఫ్టీ చాలా ముఖ్యమని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed