'లైగర్' హీరోయిన్ ఇంట విషాదం..

by Shyam |   ( Updated:2021-07-11 01:31:48.0  )
bollywood heroine
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె నానమ్మ స్నేహలతా పాండే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపధ్యంలో అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనన్య పాండే తండ్రి చుంకీ పాండే అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. తన తల్లి స్నేహలతా పాండేకు చుంకీ పాండే తలకొరివి పెట్టారు. తనకు ఎంతగానో ఇష్టమైన వ్యక్తి ఇక లేరని అనన్య తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం అనన్య ‘లైగర్’ సినిమాతో తెలుగులో ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే.. పూరి జగన్నాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.

https://twitter.com/instantbolly/status/1413867988130750465?s=20

Advertisement

Next Story