- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబాయ్ లో భార్యాపిల్లల గురించి సల్మాన్ ఖాన్ ఏమన్నాడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే.. టక్కున కండల వీరుడు సల్మాన్ ఖాన్ అని చెప్పేస్తారు. ఐదు పదుల వయసు.. అంతకుమించి వివాదాలు.. హీరోయిన్లతో ఎఫైర్లు అన్నీ సల్లూభాయ్ కి కొట్టిన పిండి. ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని అడగడానికి బదులు అసలు పెళ్లి చేసుకుంటాడా..? అని అడిగేస్తున్నారు అభిమానులు. ఇక సల్లూభాయ్ మీద వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. అందులో ఒకటి.. సల్మాన్ ఖాన్ కి ఆల్రెడీ పెళ్లైపోయిందని, వారికి 17 ఏళ్ల కూతురు కూడా ఉందని, భార్యాబిడ్డలను దుబాయ్ లో పెట్టి ఇక్కడ పెళ్ళికానట్లు నటిస్తున్నాడని ఒక నెటిజన్ గతంలో ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా ఆయన భార్య పేరు నూర్ అని, కూతురు అక్కడే చదువుకుంటుందని, సల్మాన్ ఎప్పుడూ దుబాయ్ వెళ్ళడానికి కారణమదేనని కూడా ఆరోపించాడు. ఇక తాజాగా ఈ ఆరోపణలపై సల్లూభాయ్ స్పందించారు.
తాజాగా సల్మాన్ తన తమ్ముడు అర్బాజ్ ఖాన్ నిర్వహిస్తున్న ‘షో పించ్’ లో పాల్గొన్నాడు. ఇక ఈ షోలో తమపై సోషల్ మీడియాలో వచ్చిన దారుణమైన కామెంట్ల గురించి సెలబ్రిటీలను అడిగి వాళ్ల రియాక్షన్ తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో షో కి వచ్చిన సల్మాన్‌ను అర్బాజ్ ఇదే ప్రశ్న అడిగాడు. నీకు పెళ్లై, 17 ఏళ్ళ కూతురు ఉందని, వారు దుబాయ్ లో ఉంటారట కదా అన్న అని అడిగాడు. ఈ ప్రశ్న విన్న సల్మాన్ షాక్ అయ్యి ” అసలు ఈ వార్త గురించి నేనెప్పుడూ వినలేదు.. ఇదంతా అబద్ధం. వాళ్లు ఎవరి గురించి మాట్లాడారో నాకు తెలియదు. నాకు భార్య లేదు. నేను 9 ఏళ్ల వయసు నుంచి ఇండియాలోనే, గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటాను. అయినా ఇలాంటి వార్తలపై నేను స్పందించను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త మరోసారి నెట్టింట్లో వైరల్ గా మారింది.