పొలంలో నాటేసిన సల్మాన్

by Shamantha N |   ( Updated:2020-07-14 22:45:29.0  )
పొలంలో నాటేసిన సల్మాన్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో హీరోలు, హీరోయిన్లు అందరూ ఇంటికే పరిమితం అయ్యాయి. అయితే ఎవరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కొత్త పనిని నేర్చకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాక్‌డౌన్‌లో తన సమయాన్ని పన్వేల్ ఫాం హౌజ్‌లో గడుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్యవసాయ క్షేత్రంలో సల్మాన్ నాటు వేస్తున్న ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆరంభం కొన్నిరోజుల పాటు గాళ్ ఫ్రెండ్స్‌తో ఫామ్‌హౌస్‌లో ఫుల్ జాలీగా గడిపేసిన సల్మాన్ భాయ్ ఆ తర్వాత అసలైన పనిలోకి దిగాడు. పొలం పనిపై మక్కువ పెంచుకున్నాడు. తాజాగా సల్మాన్ ఒళ్లంతా బురద అంటుకుని ఉండగా తీసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇన్ స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను పోస్ట్ చేసిన సల్మాన్‌. రైతులందరినీ గౌరవించండి అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈఫోటోను సల్మాన్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed