బ్రేకింగ్: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంట విషాదం..

by Shyam |   ( Updated:2021-09-07 23:19:04.0  )
బ్రేకింగ్: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంట విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “మా అమ్మ శ్రీమతి అరుణ భాటియా ఈ ఉదయం ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, వేరే లోకంలో ఉన్న నాన్నతో కలిసిపోయారు. ఆమె నా ప్రాణం.. ఆమె మరణం వల్ల నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను. ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి” అంటూ ట్వీట్ చేశారు.

గత కొంత కాలంగా ఆనారోగ్యంతో భాదపడుతున్న ఆమెను ముంబైలోని హీరానందాని హాస్పిటల్‌లో చేర్పించారు. తల్లి అనారోగ్య కారణంగా అక్షయ్ ఇటీవలే లండన్ లోని షూటింగ్ ని కాన్సిల్ చేసుకొని తిరిగి వచ్చేశారు. తన తల్లి ఆరోగ్యం కుదుటపడాలని, అభిమానులందరు ప్రార్ధించాలని అక్షయ్ కోరారు. కానీ, అంతలోనే ఆమె తల్లి కన్నుమూయడం విషాదమని అభిమానులు తెలుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అక్షయ్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Advertisement

Next Story