వైసీపీ వర్సెస్ టీడీపీ.. దేవుడి వద్దకు పంచాయితీ

by Anukaran |
వైసీపీ వర్సెస్ టీడీపీ.. దేవుడి వద్దకు పంచాయితీ
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల మధ్య మాటల యద్ధం నడుస్తోంది. ఇరువురు ఒకరిపై మరొకరు వరస ఆరోపణలు చేసుకుంటూ నియోజకవర్గంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందని గుంటూరు జిల్లాలో నాయకులు చర్చించుకుంటున్నారు.

అసలేమైంది..

టీడీపీ తరఫున వినుకొండ నియోజకవర్గానికి వరుసగా రెండు సార్లు బీవీ అంజనేయులు ఎమ్మెల్యేగా కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ, గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు చేతిలో పరాజయం పొందారు. అప్పటినుంచే ఇరువురి మధ్య వైరం మొదలైందని నియోజకవర్గంలో టాక్. ఇదే సమయంలో తన వద్ద ఉన్న 100 ఎకరాలను బొల్లా ప్రభుత్వానికి అమ్మారు. ఈ విషయంపై స్పందించిన జీవీ ఆంజనేయులు పనికిరాని 100 ఎకరాల భూమిని అత్యధిక ధరకు అమ్మారని.. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు. జీవీ ఆంజనేయులు వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.

ఇది ఇలా ఉంటే కరోనా సమయంలో జీవీ ఆంజనేయులు నియోజకర్గంలో శివశక్తి ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మె్ల్యే కరోనా బాధితులను పట్టించుకోవడం లేదని.. ప్రతిపక్ష నేతగా ముందుకొచ్చానని ఆంజనేయులు కామెంట్లు చేశారు. కానీ, శివశక్తి ఫౌండేషన్‌కు డబ్బులు ఎన్‌ఆర్ఐలు పంపిస్తున్నారని.. బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య వైరం పెరిగింది. ఇటువంటి సమయంలో పోలీసులకు జీవీ ఆంజనేయుల మధ్య వాగ్వాదం, హౌస్ అరెస్ట్‌తో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

అయినప్పటికీ, తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, కోటప్పకొండ సాక్షిగా ప్రమాణం చేయాలని జీవీ ఆంజనేయులు బొల్ల బ్రహ్మనాయుడికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగానే సోమవారం బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ కోటప్పకొండ సాక్షిగా సోమవారం జీవీ ఆంజనేయులు ప్రమాణం చేశారు. తాను కష్టపడి సంపాధించిన డబ్బులతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నందీశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గంలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story