- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రాష్ట్రాలకు మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచుతారా?
దిశ, తెలంగాణ బ్యూరో: జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచేలా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని, మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. మంత్రుల నివాసంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సీట్లు పెంచాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీని కోరగా 2026 వరకు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందన్నారని పేర్కొన్నారు. మరి ఇప్పుడు జమ్మూ, కశ్మీర్‌లో ఎలా సాధ్యమని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. జమ్మూ, కశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీ సీట్లు పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని వినోద్ కుమార్ అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153 కు పెంచాలని వినోద్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు.