- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేములవాడ బరిలో బోయినపల్లి వినోద్ కుమార్..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? ఉప ఎన్నికలు తప్పేలా లేవా? ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఆ నేత పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం చర్చనీయాంశం కావడంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహిస్తారని ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అయితే, ఈ స్థానంలో బోయినపల్లి వినోద్ కుమార్‌ను బరిలోకి దించేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వేములవాడలో ఏం జరుగుతుంది.. ప్రస్తుత పరిస్థితులపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
పౌరసత్వం వివాదం..
వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ అంశం గురించి ఇంటా బయటా సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన జర్మనీ పౌరుడని ఎమ్మెల్యేగా రమేష్ బాబు ఎన్నిక చెల్లదన్న విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పౌరసత్వంపై క్లారిటీ ఇవ్వాలని హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో నేడో రేపో రమేష్ బాబు ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. వేములవాడ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇదే చర్చ సాగుతోంది. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం గోప్యంగా వ్యవహరిస్తున్న వారి చేతలు మాత్రం చెప్పకనే చెప్తున్నాయి. ఇంతకాలం వేములవాడ నియోజకవర్గం విషయంలో అంటిముట్టనట్టు వ్యవహరించిన కేటీఆర్ ఇటీవల టూర్లు చేస్తున్నారు. పలు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అవుతూ తనకు వేములవాడపై మక్కువ ఉందని ప్రకటించారు. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యం అయితే గులాబీ జెండా ఎగురేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది.
బరిలో బోయినపల్లి..
ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడి నుండి బరిలో నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆయన వేములవాడలో తరుచూ పర్యటిస్తుండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. కేటీఆర్ టూర్‌తో పాటు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రి ఐకె రెడ్డితో పాటు ఆయన హాజరయ్యారు. ఇటీవల కాలంలో పలుమార్లు వేములవాడలో పర్యటించడంతో ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తారన్న చర్చ ఊపందుకుంది. ఓ వైపున కరీంనగర్ ఎంపీ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెట్లలో తిరుగుతూనే వేములవాడపై ప్రత్యేక దృష్టి సారించడమే ఈ చర్చకు కారణమైంది. పార్టీ కార్యక్రమాలకు సంబందించిన వ్యవహారాలను కూడా చక్కబెడుతున్న వినోద్ కుమార్ విలేజ్ లెవల్ కేడర్‌తో అటాచ్‌మెంట్ పెంచుకుంటున్నారు. అధికారిక కార్యక్రమాలను కేటీఆర్ పర్యవేక్షిస్తుంటే పార్టీ వ్యవహారాలను బోయినపల్లి చక్కబెడుతున్నారు. దీంతో బోయినపల్లి వేములవాడలో పోటీ చేయడం ఖాయం ఆన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బావమరిది ప్లేస్ భర్తీ
వేములవాడ నియోజకవర్గానికి బోయినపల్లి వినోద్ కుమార్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు స్వయానా మేనత్త కొడుకే వినోద్ కుమార్ కావడం విశేషం. ఇదే నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం నాగారం గ్రామం బోయినపల్లి అమ్మమ్మ ఊరు కావడం కూడా ఆయనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. అలాగే రమేష్ బాబు పౌరుడు కాదని తేలితే చెన్నమనేని ఆడపడుచు కుటుంబానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు.
కేసీఆర్ సన్నిహితుడు
కేసీఆర్ తీసుకునే విధాన నిర్ణయాల్లో పాలుపంచుకుంటారని బోయినపల్లి వినోద్ కుమార్‌కు పేరుంది. ఈ కారణంగానే ఎంపీగా ఓడిపోయినా కేసీఆర్ ప్రణాళికా సంఘం క్రియేట్ చేసి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారని పార్టీ వర్గాలు బహిరంగాంగానే చెప్తుంటాయి. ఈ నేపథ్యంలోనే వేములవాడ ఉప ఎన్నికల్లో బోయినపల్లిని బరిలో నిలిపే ఆలోచనలో అధిష్టానం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన వేములవాడతో సంబందాలు మెరుగు పర్చుకుంటున్నారని అంటున్నారు. అయితే, తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.