- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మకాల్లో BMW మెరుగైన వృద్ధి
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన టూ-వీలర్ వాహన అమ్మకాలు గతేడాది కంటే 6.65 శాతం పెరిగి 2,403 యూనిట్ల నుంచి 2,563 యూనిట్లకు చేరుకున్నాయని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో 2019లో ఇదే త్రైమాసికంతో పోలిస్తే డీలర్‌షిప్‌లకు పంపిణీ 51 శాతానికిపైగా పైగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది.
‘ముఖ్యంగా కరోనా సంక్షోభం కొనసాగుతున్న సమయంలో బీఎండబ్ల్యూ మెరుగైన అమ్మకాల నిర్వహించిన ప్రీమియం మోటార్స్‌సైకిల్ బ్రాండ్‌గా నిలిచింది. ప్రధానంగా కరోనా నేపథ్యంలో సరైన ప్రణాళిక, భవిష్యత్తు వ్యూహం, కస్టమర్లు కోరుకునే స్థాయిలో కొత్త ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టిని కలిగి ఉన్నామని’ బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది అమ్మకాల్లో ప్రధానంగా జీ310 ఆర్, జీ 310 జీఎస్ బైకులు అమ్మకాల వృద్ధిని పెంచాయని, ఈ రెండు వాహనాలు మొత్తం వార్షిక అమ్మకాల్లో 80 శాతానికిపైగా వాటాను కలిగి ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
ఈ క్రమంలోనే బీఎమ్‌డబ్ల్యూ ఇండియా మంగళవారం తన కొత్త ఎమ్ స్పోర్ట్ కారును విడుదల చేసింది. ఇదివరకటి కంటే మెరుగైన పనితీరుతో 2 సిరీస్ గ్రాన్‌కూపే పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు కంపెనీ పేర్కొంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చిన బీఎమ్‌డబ్ల్యూ 220ఐ ఎమ్ స్పోర్ట్ ధరను రూ. 40.90 లక్షల(ఎక్స్‌షోరూమ్)ని కంపెనీ తెలిపింది.