- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ స్కూటర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటారాడ్ భారత మార్కెట్లో తన కొత్త సీ400 జీటీ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 9.95 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. దీంతో ఈ స్కూటర్ భారత్‌లో లభించే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అంతేకాకుండా యమహా తర్వాత భారత్‌లో లభించే రెండో మ్యాక్సీ స్కూటర్‌గా ఉంది. ఈ స్కూటర్ 350సీసీ సింగిల్ సిలిండర్‌తో మధ్యతరహా సామర్థ్యంతో వస్తోంది. అలాగే, టెలిస్కోపిక్ ఫోర్క్, వినియోగదారుల భద్రత కోసం ఈ బైక్ ముందు, వెనకా డ్యుయెల్ డిస్క్‌లను అమరించినట్టు కంపెనీ వెల్లడించింది. పూర్తిగా అత్యాధునిక సాంకేతికతతో బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేసే టీఎఫ్‌టీ డ్యాష్‌బోర్డ్, ఆటోమెటిక్ స్టెబిలిటీ కంట్రోల్, డ్యుయెల్ ఏబీఎస్ స్టాండర్డ్ లాంటి ఫీచర్లను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
‘సరికొత్త బీఎండబ్ల్యూ సీ400 జీటీ ప్రధానంగా భారత్‌లోని పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చాము. మెరుగైన సామర్థ్యంతో మధ్య తరహా స్కూటర్ పట్టణ ప్రాంతాలతో పాటు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనువుగా ప్రయాణించేందుకు రూపొందించామని’ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా అన్నారు.