- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఎండబ్ల్యూ 'సిరీస్ 2 గ్రాన్ కూపే' కారు విడుదల
దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) గురువారం బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే (Gran coupe) ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ధరను రూ. 39.3 నుంచి రూ. 41.4 లక్షల (ఎక్స్‌షోరూమ్) గా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే, సిరీస్ 2 గ్రాన్ కూపే ప్రస్తుతం డీజిల్ వెర్షన్ (Diesel version)అందుబాటులో ఉంటుందని, పెట్రోల్ వెర్షన్ (petrol version) త్వరలో విడుదల చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.
తాజాగా విడుదల చేసిన మోడల్‌తో బీఎండబ్ల్యూ ఇండియా శ్రేణిలో ఇది 12 కారని, చెన్నైలో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో తయారు చేయబడిందని తెలిపింది. ‘మొట్టమొదటిసారిగా బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే విభాగంలో ఫోర్-డోర్ (four door) కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త బీఎండబ్ల్యూ స్టైలిష్, విలాసవంతమైన సదుపాయాలను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టాం. దీంతో పాటు విలువైన పనితీరు, నాణ్యతతో కస్టమర్లను ఆకర్షిస్తుందని ‘ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా (vikram pawah) వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ఏడాదిలో బీఎండబ్ల్యూ ఇండియా దేశీయంగా మొత్తం 11 వాహనాలను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.