- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఎమ్‌డబ్ల్యూ ‘మేడ్ ఇన్ ఇండియా’ కారు లాంచ్..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ తన మేడ్ ఇన్ ఇండియా 2 సిరీస్ గ్రాన్కూపే వేరియంట్మోడల్ 220ఐ స్పోర్ట్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 37.9 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించినట్టు బుధవారం కంపెనీ వెల్లడించింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన ఈ స్పోర్ట్ వేరియంట్ బుధవారం నుంచే డీలర్‌షిప్‌లలో అమ్మకానికి సిద్ధంగా ఉందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘గతంలో దేశీయ మార్కెట్లో మంచి ఆదారణ కలిగిన బీఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే మోడల్‌ను ‘స్పోర్ట్’ వేరియంట్‌లో చేర్చడం ద్వారా మరింత అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని తమ వినియోగదారులు పొందగలరని ‘బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా చెప్పారు.
ప్రీమియం విభాగంలో పెట్రోల్ మోడల్ కార్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ కొత్త 220ఐ స్పోర్ట్ స్టైల్‌ని తీసుకొచ్చామని, కొత్త డ్రైవింగ్, మెరుగైన పనితీరుతో ఈ కారు వినియోగదారులకు ఉత్తమ ఎంపిక అని ఆయన పేర్కొన్నారు. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుందని, కేవలం 7.1 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగిన ఈ కారు గరిష్ఠ వేగం 233 కిలోమీటర్లని కంపెనీ వివరించింది. ఆకట్టుకునే ఇటీరియర్ డిజైన్‌తో పనోరమా సన్ రూఫ్, పార్కింగ్ కంట్రోల్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.