రేపే 'బ్లూ మూన్'

by Shamantha N |
రేపే బ్లూ మూన్
X

దిశ, వెబ్ డెస్క్: ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వచ్చే సందర్భాల్లో ‘బ్లూ మూన్’ వస్తుందని ఖగోళ శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. కాగా భారత్ లో శనివారం రాత్రి 8.19 గంటలకు బ్లూమూన్ సంభవించనున్నట్టు శాస్తవేత్తలు తెలిపారు. బ్లూమూన్ అనేది రెండు మూడేండ్ల కోసారి వస్తుందని వారు అంటున్నారు. కానీ శనివారం వచ్చే బ్లూమూన్‌ను మళ్లీ చూడాలంటే 2039 వరకు ఆగాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా ఒకనెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు ఆ రెండో పౌర్ణమిని బ్లూమూన్ గా వ్యవహరిస్తారు. బ్లూమూన్ అనేది సాధారణంగా తెలుపు, పసుపు రంగుల్లో కనిపిస్తుంది. కానీ ఈ సారి బ్లూమూన్ భిన్నంగా కనిపించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

Next Story