కరోనా ముందుస్థాయికి బ్లూ-కాలర్ ఉద్యోగాలు!

by Shamantha N |
కరోనా ముందుస్థాయికి బ్లూ-కాలర్ ఉద్యోగాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంబంధిత లాక్‌డౌన్ వల్ల బ్లూ-కాలర్ ఉద్యోగాలు భారీగా క్షీణించిన తర్వాత ఫుడ్ అండ్ కిరాణా సహా డెలివరీ విభాగాల్లో బ్లూ-కాలర్ ఉద్యోగాలు కోలుకున్నాయని స్టార్టప్ సంస్థల్లో నియామకాలను చేపట్టే వాహన్ వెల్లడించింది. ఫుడ్ అండ్ కిరాణా డెలివరీ విభాగాల్లో బ్లూ-కాలర్ సిబ్బంది డిమాండ్ కరోణాకు ముందున్న స్థాయిలో 100 శాతానికి చేరుకుందని, ప్రస్తుతం డెలివరీ రంగం ప్రతి నెలా 2.5 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాలని సృష్టిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

ప్రధానంగా కరోనా సంబంధిత ఆంక్షలు తొలగిన తర్వాత ఐపీఎల్, పండుగ సీజన్ నేపథ్యంలో ఈ నియామకాల డిమాండ్ పెరిగిందని పేర్కొంది. ‘కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో భారీ స్థాయిలో తగ్గిపోయిన బ్లూ-కాలర్ ఉద్యోగాల డిమాండ్ ఇటీవల మెరుగైన రికవరీని సాధిస్తోంది. ముఖ్యంగా ఫుడ్, కిరాణా డెలివరీ విభాగంలో ఎక్కువగా ఉన్నట్టు’ వాహన్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో మాధవ్ కృష్ణ చెప్పారు. ఈ ధోరణి కరోనా మహమ్మారి నేపథ్యంలో పెరుగుతున్న వినియోగదారు ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed