వాట్సాప్ ప్రేమ.. ఎక్కడికి దారి తీసింది..?

by Sumithra |   ( Updated:2021-02-21 10:12:56.0  )
వాట్సాప్ ప్రేమ.. ఎక్కడికి దారి తీసింది..?
X

దిశ, వెబ్‌డెస్క్ : స్నేహమన్నాడు.. ప్రేమన్నాడు.. చెట్టాపట్టాల్ వేసుకుని కనపడిన ప్రదేశాలన్నీ తిప్పాడు. మచ్చిక చేసుకుని.. మత్తులోకి దింపి సన్నిహితంగా తీసుకున్న ఫోటోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. నీకు, నాకు బ్రేకప్ అంటూనే.. బెకారు పనులకు తెగపడ్డాడు. నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న యువకుడి ఉదాంతం చెన్నైలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

పుదుచ్చేరికి చెందిన కార్తీ జులాయిగా తిరుగుతుంటాడు. అతడి స్నేహితుడు కొద్దిరోజుల క్రితం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడంతో కార్తీ ఆ గ్రూపులో చేరాడు. అదే గ్రూపులో ఉన్న ఓ యువతితో కార్తీ పరిచయం పెంచుకున్నాడు. మొదట స్నేహితులుగా ఛాటింగ్ చేసుకున్న ఇద్దరు.. ఓ రోజు కలుసుకున్నారు. అలా దగ్గరైన ఇద్దరూ కలిసి పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలన్నీ తిరిగారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. టూర్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.

టూర్ ముగిసిన కొద్ది రోజులకే కార్తీ.. ఆ యువతికి బ్రేకప్ చెప్పేశాడు. ఎవరి పనులు వారు చేసుకుంటున్న క్రమంలో సడన్‌గా ఓ రోజు కార్తీ ఆ యువతికి ఫోన్ చేసి, తన శారీరక కోరికలు తీర్చాలని పట్టుబట్టాడు. దానికి యువతి తిరస్కరించడంతో టూర్ సమయంలో ఇద్దరు తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అలా ఆ యువతిని కూవత్తూర్ బస్టాండ్‌కు రప్పించి ఆమె వద్ద నుంచి రూ.15 వేలు తీసుకుని వదిలేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఫోన్ చేసి బెదిరించడంతో మరో రూ.5 వేలు సమర్పించుకుంది.

అంతటితో ఆగని కార్తీ మరోసారి ఫోన్ చేసి తనతో శృంగారం చేయాలని, దానితోపాటు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో ఫోటోలు, వీడియోలు మీ అమ్మానాన్నలతోపాటు మిగతా కుటుంబ సభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. కార్తీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో ఆ యువతి విషయాన్ని ఇంట్లో చెప్పేసింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కార్తీని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story