'బ్లాక్ విడోస్' బ్లాస్ట్

by Shyam |   ( Updated:2023-06-13 16:13:20.0  )
బ్లాక్ విడోస్ బ్లాస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బోల్డ్ అండ్ కాన్సెప్ట్స్‌కు ఓటీటీలో ఆదరణ ఎక్కువైంది. కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే చాలు ఆడియన్స్ కనెక్ట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ బ్లాక్ విడోస్. షమితా శెట్టి, స్వస్తికా ముఖర్జీ, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సిరీస్‌ను బిస్రా గుప్తా దర్శకులు. భర్తల వేధింపులకు తట్టుకోలేని ముగ్గురు ఓ వెకేషన్ పీరియడ్‌లో బోట్‌‌లో బాంబ్ సెట్ చేసి మర్డర్ చేస్తారు. కానీ అది ప్రమాదవశాత్తు జరిగినట్లు క్రియేట్ చేసి సొసైటీ నమ్మేలా చేస్తారు. కానీ పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే ఉండగా.. తీరా కేసు క్లోజ్ చేసే సమయానికి.. చనిపోయిన ముగ్గురిలో ఓ వ్యక్తి ప్రాణాలతో తిరిగి రావడంతో వీరి ప్లాన్ రివర్స్ అవుతుంది. భర్తలు చనిపోతే ఎంజాయ్ చేద్దామనుకున్న భార్యలు నిజంగా ఎంజాయ్ చేస్తారా? పోలీసుల విచారణలో ఏం తేలుతుంది. మూడు హత్యలు.. ముగ్గురు నిందితులు.. ఒక్క నిజం.. క్రిస్టమస్ టైంలో చెప్తానంటున్నారు సిరీస్ మేకర్స్. డిశంబర్ 18న బ్లాక్ విడోస్ రిలీజ్ కానుండగా… తాజాగా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి ఈ సిరీస్‌లో నటిస్తుండగా.. సోషల్ మీడియాలో ట్రైలర్ షేర్ చేసిన శిల్పా.. ఫ్యాబులస్‌గా ఉందని చెప్పింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూసేందుకు, షమిత యాక్టింగ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed