కరోనా రోగికి బ్లాక్‌ఫంగస్ చికిత్స.. ఆందోళనలో వైద్యులు..?

by Shyam |
కరోనా రోగికి బ్లాక్‌ఫంగస్ చికిత్స.. ఆందోళనలో వైద్యులు..?
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కొవిడ్ పాజిటివ్ ఉన్న బ్లాక్ ఫంగస్ రోగికి పొరపాటున కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఒక రోజు తర్వాత అసలు విషయం గ్రహించి సదరు రోగిని గాంధీ ఆస్పత్రికి కొవిడ్ చికిత్సల నిమిత్తం తరలించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం నాలుగు రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఓ రోగి ఈఎన్‌టీ ఆస్పత్రికి రాగా అతనికి కొవిడ్ పాజిటివ్ ఉందా ? లేదా ? అనేది పరిశీలించకుండానే వైద్యులు ఇన్ పేషంట్ గా చేర్చుకుని శస్త్ర చికిత్స సైతం నిర్వహించారు. అనంతరం రోగికి సంబంధించిన రిపోర్టులలో కరోనా ఉన్నట్లు గుర్తించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని బయటకు పొక్క కుండా జాగ్రత్త పడ్డారు. అయితే సదరు రోగికి శస్ర్త చికిత్స నిర్వహించిన వైద్యులు, సిబ్బంది మాత్రం తమకు కొవిడ్ సోకిందేమోననే ఆందోళనలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed