ENTలో పెరగని బ్లాక్ ఫంగస్ సర్జరీలు

by vinod kumar |
Koti ENT Hospital2
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కోఠి ENT ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ రోగులకు అందించే శస్త్ర చికిత్సల సంఖ్య ఇంకా పెరగలేదు. గురువారం ఆస్పత్రిని సందర్శించిన సీఎస్ సోమేష్ కుమార్ ప్రతి రోజు
హాస్పిటల్‌లో నిర్వహించే ఆపరేషన్లను 40కి పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, పూర్తి స్థాయిలో మౌలిక వసతులు సమకూరకపోవడంతో గతంలో ఉన్న ఐదు టేబుళ్ల పైనే సర్జరీలు నిర్వహించారు. శుక్రవారం ఆస్పత్రి ఓపీ విభాగానికి 229 మంది బ్లాక్ ఫంగస్ రోగులు రాగా వీరిలో 28 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఆస్పత్రిలో ఉన్న ఇన్ పేషంట్ల సంఖ్య 286కు చేరింది. 14 మందిని డిశ్చార్జ్ చేయగా ఇప్పటివరకు 20 సర్జరీలు చేశారు.

Advertisement

Next Story