యశోద ఆసుపత్రి ఎదుట బీజేపీ నేతల నిరసన

by Shyam |
యశోద ఆసుపత్రి ఎదుట బీజేపీ నేతల నిరసన
X

దిశ, కంటోన్మెంట్: కరోనా వైద్యం పేరిట రూ.లక్షలు గుంజుతున్న యశోద ఆస్పత్రితో పాటు ఇతర హాస్పటల్స్ పై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నేతలు ఆదివారం ఆందోళన చేపట్టారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుస్మాన్ పతాకాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు అరుణ్, ప్రభాకర్, పవన్ రెడ్డి, నరహారితేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed