- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బార్‌ను తొలగించాలంటూ బీజేపీ మహిళా నేతల ధర్నా..
దిశ, రాజేంద్రనగర్ : అల్కాపురి టౌన్ షిప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న బార్‌ను వెంటనే తొలగించాలని శనివారం బార్ ఎదుట స్థానిక మహిళలు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్ షిప్ ప్రధాన రహదారిపై నూతనంగా బార్ షాప్ ఏర్పాటు చేస్తూ ఉండగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాలనీ వాసులతో పాటు బీజేపీ నేతలు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అల్కాపురి టౌన్ షిప్ కాలనీలో మంచి నీళ్ల వసతి ఇవ్వడంలో మణికొండ మున్సిపాలిటీ తీవ్రంగా విఫలమైందని, కానీ బార్లకు మాత్రం యధేచ్చగా అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రధాన రహదారిలో సాయంకాలం వేళల్లో మహిళలు వృద్ధులు వాకింగ్‌కి వెళ్తున్నారని, నూతనంగా బార్ ఏర్పాటు చేయడంతో చైన్ స్నాచర్లకు, తాగుబోతులకు ఈ రహదారి అడ్డాగా మారుతోందని.. వెంటనే ఈ బార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ జైహింద్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మణికొండ కౌన్సిలర్లు శ్రీకాంత్,బీరప్ప, మహిళా మోర్చా అధ్యక్షురాలు అనితా దేవి, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, నరసయ్య చారి, శంకర్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.