- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మాయ మాటలతో కేసీఆర్ మోసం చేస్తుండు’
దిశ, అసిఫాబాద్: దహెగాం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ కే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి రైలు మార్గం ద్వారా బెల్లంపల్లిలో దిగి నేరుగా దహేగాం మండల కేంద్రానికి చేరుకున్నారు. ట్రాక్టర్ పై ర్యాలీగా బయలుదేరి, ముందుగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి రైతు మహాధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీ కే అరుణ మాట్లాడుతూ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తడుస్తూ రైతు మహా ధర్నాలో పాల్గొన్న రైతులను, ప్రజల ఓపికను మెచ్చుకున్నారు. కేసీఆర్ మాయ మాటలు చెప్పి బురిడి కోట్టిస్తున్నాడని, ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం పని చేయాల్సిందే కానీ తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.
అకాల వర్షాల వల్ల, వర్షాలు పడక నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫసల్ భీమా యోజన పెడితే, తెలంగాణ ముఖ్యమంత్రి అట్టి రైతుల డబ్బులు 800 కోట్లను పక్కదారి పట్టించి రైతుల నోళ్ళల్ల మట్టి కొట్టిండని ఆరోపించారు. రైతులకు పోడు భూముల పట్టాలు ఇస్తానని ఏండ్లు గడుస్తున్నా ఒక్క రైతుకు కూడా పట్టా ఇవ్వలేదని అన్నారు. పోడు రైతులకు పట్టాపాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు బీజేపీ పార్టీ నిద్ర పోదని, బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. వృధ్దులకు రెండు వేల పింఛన్, రైతు బంధు, ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడవని కేసిఆర్ తెలుసుకొవాలని అన్నారు. డబ్బులతో ఏమైనా చేయొచ్చన్న ధీమాతో ముఖ్యమంత్రి ఉన్నాడని, మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇంత వరకు ఇవ్వలేదని విమర్శించారు.
కేసీఆర్ పథకాలన్నీ హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయని, దళిత బంధు పథకం కూడా హుజురాబాద్ ఎలక్షన్ల కోసమే రూపొందించాడని, ఎలక్షన్లు అయ్యాక ఎవ్వరికీ డబ్బులు రావని అన్నారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ వెంటనే 30 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లచాలని ఆమె డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బీజేపి జిల్లా అధ్యక్షులు జెబి. పౌడల్, బీజేపి నాయకులు పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. కొత్తపల్లి శ్రీనివాస్. జిల్లా ప్రధాన కార్యదర్శి కోంగ సత్యనారాయణ, పట్టణ అద్యక్షులు గోలెం వెంకటేష్, నాయకులు వీరభద్రచారి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.