- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే.. గిరిజన బాలిక మృతి
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గిరిజన బాలిక అత్యాచారానికి గురై, మృతి చెందినదని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ ఆరోపించారు. బాలిక మరణానికి కారకులైన నిందితులను పట్టుకోవడంలోనూ ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శుక్రవారం బాలిక స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా పిక్లా తండాలోని బాలిక తల్లిదండ్రులను బీజేపీ గిరిజన మోర్చా నాయకులు పరమార్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన అమ్మాయి చనిపోయి వారం రోజులు గడుస్తున్నా.. నేరస్థులను పట్టుకోవడంలేదని హుస్సేన్ నాయక్ విమర్శించారు. నిందితులను వెంటనే పట్టుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story