- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ వచ్చినా ప్రజల పరిస్థితి మారలేదు
దిశ ఆలేరు: తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో…రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజలు విరక్తితో ఉన్నారని చెప్పారు. కుటుంబ పాలనతో తెలంగాణ పూర్తిగా దోపిడీకి గురైందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న సుమారు మూడు వేల మంది ముఖ్య నాయకులను… రాష్ట్రం వచ్చాక వారిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ పాలనలో అన్యాయాలు, అవినీతి ,అత్యాచారాలు, అక్రమాలు, జరిగాయని ఆరోపించారు. వాటితో ప్రజలకు విరక్తి కలిగిందని అన్నారు. ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ ఎన్నికలకు వెళ్లడం లేదని తెలిపారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలంటే దమ్ముంటే శాసన సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.