అఖిలపక్ష సమావేశమంటే.. ఎందుకు భయం?

by Shyam |
అఖిలపక్ష సమావేశమంటే.. ఎందుకు భయం?
X

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ విపత్తుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు జంకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక, కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే రైతుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయానికి రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎన్నిసారు తీసుకుపోయినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం చేసిన సూచనలు సలహాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో టోకెన్లు, డ్రా సిస్టమ్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నరన్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తేమ, తాలు శాతం సాకుతో అధికారులు కోతలు విధిస్తున్నారన్నారు. స్వయాన ముఖ్యమంత్రి తనయుడు మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో ధాన్యం కాల్చివేశారంటే ప్రభుత్వం పనితీరుపై రైతుల ఆవేదన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

tags:Bjp,Trs, Kcr, Bandi Sanjay, Market, Farmers, Paddy

Advertisement

Next Story

Most Viewed