- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు నిద్రలేకుండా చేస్తా : బండి సంజయ్
దిశ, దుబ్బాక: దుబ్బాకలో చేసిన సవాల్‌కు తాను కట్టుబడి ఉన్నానని.. రానీ సవాల్‌ను స్వీకరించమంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికీ బయటకు రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంతేగాకుండా దమ్ముంటే తన సవాల్ స్వీకరించి తాను చెప్పింది అవాస్తవమని రుజువు చేస్తే దుబ్బాక నడిబొడ్డున తన పదవికి రాజీనామా చేసి ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు అల్లర్లు సృష్టించి ఎన్నికలు వాయిదా వేసే విధంగా ప్రయత్నం చేస్తోందని, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావ్‌కు మద్దతుగా ఆదివారం రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి, రాయపోల్, లింగారెడ్డిపల్లి, ముంగీస్‌పల్లి, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్, కొత్తపల్లి గ్రామాల మీదుగా 1500ల బైకులతో భారీ బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే ఎవరూ భయపడకండి, తిరగబడండి అని, మేము మీ వెంట ఉన్నామని హామీ ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గ సమస్యల కోసం మాట్లాడదామంటే కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకక, ఆత్మ క్షోభించి రామలింగారెడ్డి చనిపోయాడన్నారు. అంతేగాకుండా దర్శకుడు రాజమౌలి కొమురంభీంకు టోపిపెట్టి సినిమా రిలీజ్ చేస్తే.. థియేటర్లు పగులగొడతామని హెచ్చరించారు. దళితున్ని సీఎం చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేసిండపి ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే.. ముఖ్యమంత్రికి నిద్రలేకుండా చేస్తానని హెచ్చరించారు.