- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబద్దాలకు కేరాఫ్‌గా బీజేపీ.. ఈటలకు అవకాశం లేదన్న హరీష్ రావు
దిశ, హుజూరాబాద్ : బీజేపీ నాయకులు అబద్దపు ప్రచారాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ మాజీ పట్టణాధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి, యువమోర్చ పట్టణాధ్యక్షుడు పంజాల సతీష్‌తో పాటు మరికొంత టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీష్ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఏం పని చేశాడో చెప్పకుండా తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈటల తనపై దాడి చేస్తున్నారేమో అని చెప్పుకుంటున్నాడని, కానీ, ప్రభుత్వం అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తుందని తెలిపారు. విదేశాల్లోని నల్ల డబ్బు తీసుకువచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో రూ. 15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చిన మోడీ ఎంత మంది అకౌంట్లలో వేశారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని మహిళలను ఓట్లు అడుగుదామంటే సిలిండర్ ధర వెయ్యి రూపాయలు పెంచడంతో ఓట్లు అడిగే పరిస్థితి రాజేందర్‌కు లేదని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజేపీ చెడ్డ పార్టీ అని అన్న ఈటల రాజేందర్‌కు నాలుగు నెలల్లో మంచి పార్టీ ఎలా అయ్యిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ స్వార్థం కోసం పార్టీ మారితే ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోతారా అని ప్రశ్నించారు. అందుకే ప్రజల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ టీఆర్ఎస్ అని.. హుజూరాబాద్ తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని హరీష్ రావు అభ్యర్థించారు.