- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. లక్నోలో కొవిడ్-19 కంట్రోల్ రూమ్ అధికారులు కనీసం ప్రజలను కలుసుకోవడం గానీ, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం గానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కారణంగా ప్రజలు పిట్టల్ల రాలిపోతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది అక్రమార్కులు ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వెంటిలేటర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని మండిపడ్డారు. రోగులకు కనీసం ఆస్పత్రి బెడ్లు కూడా దొరకడం లేదు. ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడానికి బీజేపీనే కారణమని అఖిలేశ్ విమర్శించారు. బీజేపీ నిర్లక్ష్యం కారణంగానే దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.