- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముషీరాబాద్‌లో బీజేపీ హవా.. సిట్టింగ్ సీటు కదిలింది..!
దిశ, క్రైమ్ బ్యూరో : ముషీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ కార్పొరేటర్లకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ కొనసాగుతుండగా.. ప్రస్తుతం వెలువడిన ఫలితాలు పార్టీకి, సిట్టింగ్ కార్పొరేటర్లకు గట్టి షాక్ ఇచ్చాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కీలక డివిజన్‌లు అయిన ముషీరాబాద్, అడిక్ మెట్, కవాడిగూడ, రామ్‌నగర్, గాంధీనగర్‌లల్లో బీజేపీ విజయం సాధించింది.
వారసత్వానికి కమలం బ్రేకులు వేసింది..
ముఖ్యంగా, ముషీరాబాద్ నియోజకవర్గంలో రాంనగర్ నుంచి వి.శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. ఈయన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మేనల్లుడు కావడం గమనార్హం. అటు కవాడిగూడ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేశారు. ఇక గాంధీనగర్‌లో ముఠాగోపాల్ సోదరుడి భార్య ముఠా పద్మా నరేశ్ కూడా ఓటమి పాలైంది. కీలక నాయకుల ఫ్యామీలీల నుంచి వచ్చిన అభ్యర్థులకు ఈసారి ఓటర్లు వ్యతిరేకించడం గమనార్హం. ఇక అడిక్‌మెట్, ముషీరాబాద్ సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థులు కూడా ఓటమి పాలయ్యారు.