- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీటీడీ విషయంలో హైకోర్టు కీలక సూచనలు.. బీజేపీ అధ్యక్షుని హర్షం
దిశ, ఏపీ బ్యూరో: టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపట్ల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే హిందూ ధార్మిక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజకీయ పునరావాస జంబో టీటీడీ బోర్డు జీఓను తాత్కాలిక నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమన్నారు. వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి పదుల సంఖ్యలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ.. వాటిని నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బహుశా దేశంలోనే ఇలాంటి అనుభవం మరే ఇతర ప్రభుత్వాలకు ఎదురై ఉండకపోవచ్చన్నారు.
ఎన్నిసార్లు ఇలాంటి పరాభవాలు ఎదురైనా రాష్ట్రప్రభుత్వం తన ఆలోచనా విధానాలను మార్చుకోకపోవడం వారి యొక్క మొండి వైఖరిని, మూర్ఖత్వాన్ని తెలియజేస్తోందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఇలాంటి మూర్ఖులకు ఎందుకు అవకాశం ఇచ్చామా అని రాష్ట్రప్రజలు తలచుకోని రోజులు లేవని విమర్శించారు. రెండు కుటుంబాలు, కుల, అవినీతి పార్టీలకు ప్రత్యామ్నాయంగా..త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ-జనసేనల కూటమికి ప్రజలు పట్టంకట్టబోతున్నారన్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.