కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యపై ధర్నాకు బీజేపీ ప్లాన్

by Aamani |
BJP
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పంటలు నష్టపోతున్న రైతాంగానికి న్యాయం చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతున్నారు. సోమవారం రోజున ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు కాలేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంత బాధితులకు అండగా నిలిచేందుకు ధర్నా చౌక్ హైదరాబాదులో కోటపల్లి చెన్నూరు జైపూర్ రైతులతో భరోసా దీక్ష ఏర్పాటు చేశారు. ఈ దీక్షలో సభాధ్యక్షులుగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెళ్ళి, ముఖ్యఅతిథి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, అతిథిగా విజయశాంతి, రాష్ట్ర కిసాన్మోర్చా అధ్యక్షులు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. రైతులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ అందుగుల శ్రీనివాస్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed