- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత..
దిశ, ఏపీ బ్యూరో : కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉందయం మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు బైఠాయించారు. అయితే రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉందని ఆందోళన విరమించాలని పోలీసులు నచ్చజెప్పారు.
అయినప్పటికీ బీజేపీ నేతలు వినకపోవడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేయకుండా, శాంతియుతంగా ధర్నాకు దిగిన తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసులను బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యేలను అరెస్టు చేసే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం సిగ్గుచేటని బీజేపీ నేతలు విమర్శించారు.