- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌తోనే దళితులకు ‘ఆత్మగౌరవం’
దిశ, న్యూస్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఆత్మగౌరవంతో బతికారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అంతేకాకుండా దశాబ్దాల కాంగ్రెస్ పాలనతోనే దళితులు రిజర్వేషన్లు పొందారని వివరించారు. మంగళవారం టీపీసీసీ ఎస్సీ సెల్ విభాగం చైర్మన్‌గా ప్రీతమ్ బాధ్యత స్వీకరించిన అనంతరం గాంధీ భవన్‌లో నిర్వహించిన సభలో సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, సంపత్, దాసోజ్ శ్రవణ్ పాల్లొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడతూ..ఆరేండ్ల బీజేపీ పాలనలో దేశంలో లక్షలాది మంది దళితులు భయంతో బతుకుతున్నారని చెప్పారు. వారంతా ఈ దేశ పౌరులమని చెప్పుకోవాల్సిన పరిస్థితిని కేంద్రం తీసుకువస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నార్సీ, సీఏఏలతో అనేక మంది భవిష్యత్ అగమ్య గోచరంగా మారే అశకాశం ఉందన్నారు. గిరిజనులకు చట్టబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజనులను, దళితులను మోసం చేయడంలో కేసీఆర్, మోడీ ఇద్దరు ఇద్దరేనని వ్యాఖ్యలు చేశారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణా రాష్ట్ర సాధనలో దళితులే కీలక పాత్ర పోషించారన్నాని గుర్తుచేశారు. ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం నొక్కాలని చూస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నియంత పాలనను గుర్తుచేస్తుందని మండిపడ్డారు.