- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందువులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలి
దిశ, కరీంనగర్ సిటీ : దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను సోషల్ మీడియా వేదికగా సమర్ధవంతంగా తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ నాయకుడు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి పొల్సాని మురళీధర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని కొండ సత్యాలక్ష్మీ గార్డెన్‌లో భారత్ నీతి ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ హిందూ కాంక్లేవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల హిందూ సంస్కృతి, పండుగలైన దీపావళి గురించి ఫ్యాబ్ ఇండియా సంస్థ వక్రీకరించి ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ హిందువులు సంఘటితంగా ప్రతిఘటించిన తీరును కొనియాడారు.
హిందువుల ఆచార వ్యవహారాలు, భోజనాల పద్ధతి ప్రపంచంలో మరెక్కడా ఉండబోదని.. మన తీసుకునే ఆహారంలో అనేక ఔషధ గుణాలు సమ్మిలితమై ఉంటాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు కపిల్ మిశ్రా, రాధ మనోహర్, ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా సెహ్వాల్, నిర్వహకులు పెండ్యాల సాయి కృష్ణారెడ్డి, లింగంపల్లి శంకర్, పొల్సాని సుగుణకర్ రావు, కన్నబోయిన ఓదెల్, రఘునందన్ రావు మధుసూదను రావు, గజ్జె సతీష్, నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.