జియాగూడలో కరోనాను కంట్రోల్ చేయండి

by vinod kumar |   ( Updated:2020-05-13 23:07:43.0  )
జియాగూడలో కరోనాను కంట్రోల్ చేయండి
X

దిశ, హైదరాబాద్: జియగూడలో కరోనా కట్టడికి వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కు బీజేపీ నగర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జియగూడ మున్సిపల్ డివిజన్‎లో మొత్తం 69 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. మంగళవారం ఒక్కరోజే 26 కేసులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రాంతంలో కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోకపోవడం ద్వారానే కేసులు అధికమవుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా జియగూడ ప్రాంతంలో స్థానికులు లాక్‎డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. అంతే కాకుండా, మహారాష్ట్ర నుంచి ఈ ప్రాంతానికి పశువులను మోసుకెళ్లే వాహనాలు వస్తున్నాయని, దీంతో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం అవుతుందన్నారు. ఈ విషయాలను పరిశీలించి జియగూడలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story