విషాదం.. కరోనాతో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మృతి

by Sumithra |
విషాదం.. కరోనాతో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మృతి
X

లక్నో: దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సదర్ రమేశ్ చంద్ర దివాకర్(56) శుక్రవారం కరోనాతో మరణించారు. ఔరాయా నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో నాలుగు రోజులు చికిత్స పొందారు. చివరి రెండు రోజులు పరిస్థితులు విశమించాయని కుటుంబీకులు తెలిపారు. ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ మరణం కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ భార్య కూడా కరోనా బారినపడ్డట్టు కొన్నివర్గాలు తెలిపాయి. కాన్పూర్‌లో ఆమె చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

Advertisement

Next Story