- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్ధరాత్రి కారులోకి ఈవీఎంలు.. సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్
దిశ, బేగంపేట: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం శనివారం అర్ధరాత్రి ఈవీఎంలు తరలిస్తున్న బస్సు పంక్షర్ అయ్యిందని, ఈవీఎంలను ప్రైవేటు కారులోకి తరలించడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయి సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ… ఒక్క బస్సు పంక్షర్ అయితే నాలుగు బస్సులు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. అందులోని ఈవీఎం బాక్సులు మార్చడాన్ని బీజేపీ కార్యకర్తలు గుర్తించి వీడియో తీశారని చెప్పారు.
హుజురాబాద్‌లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా దిగజారిపోయారని విమర్శించారు. ఒక్క ఎన్నికల్లో గెలవడం కోసం కేసీఆర్ గల్లీ గల్లీకి మంత్రులు, ఎమ్మెల్యేలను దించారని, అయినా ఓడిపోతున్నామని తెలిసి కోట్ల రూపాయలు కుమ్మరించారని విమర్శించారు. అప్పటికీ ప్రజలు ఓట్లు వేయలేదని తెలుసుకొని ఈవీఎంలు మార్చే కుట్రకు పూనుకున్నారని ఆరోపించారు. దీనిపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం తలదించుకునేలా వందకోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.
ఎన్ని కుట్రలు పన్నినా ఈటల భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే బస్సులను మార్గమధ్యమంలో అర్ధరాత్రి నిలిపేసి ఓ డ్రైవర్ సహాయంతో ఈవీఎంలను కారులోకి మార్చారని తెలిపారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీవు, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామసుందర్ గౌడ్, కార్పొరేటర్లు సరళ, కొంతం దీపిక, నాయకులు మేకల సారంగపాణి, పెద్ది రవీందర్, కృష్ణమూర్తి, నీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.