కరోనాతో మరో బీజేపీ ఎమ్మెల్యే మృతి

by vinod kumar |
కరోనాతో మరో బీజేపీ ఎమ్మెల్యే మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా… మెల్లగా మళ్లీ విస్తరిస్తోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు వైరస్ బారినపడటమే కాకుండా పలువురు పరిస్థితి విషమించి మృతిచెందుతున్నారు. తాజాగా మహమ్మారికి మరో బీజేపీ ఎమ్మెల్యే బలైంది. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి మరణించారు. కాగా ఆమె భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సోమవారం ఆమె స్వస్థలమైన ఉదయ్ పూర్‌కు తీసుకురానున్నారు. మహేశ్వరి మృతి పట్ల బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement

Next Story