- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలపై బీజేపీ నేత సంచలన కామెంట్స్
దిశ, ఏపీ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై ఏపీ బీజేపీ కీలక నేత విష్ణువర్థన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కృష్ణా జలాల విషయంలో ఏపీకి నష్టం జరిగేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటుంటే సీఎం జగన్ చేతకాని తనంతో చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రాయలసీమ హక్కులను ఫణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను, విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా త్వరలో బీజేపీ ఉద్యమ కార్యాచరణ చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.
బీజేపీ ఆధ్వర్యంలో అవసరం అయితే శ్రీశైలంను ముట్టడిస్తామన్నారు. ఈ అంశంపై ఇతర పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులు, హక్కులను సీఎం జగన్ గాలికొదిలేశారని ఆరోపించారు. సీమలో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మిమ్మల్ని ప్రజలే గెలిపిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీపై పెత్తనం చేస్తోందని దుయ్యబుట్టారు. తెలంగాణలోని ఏపీకి చెందిన విలువైన ఆస్తులను సీఎం జగన్ వదిలేశారని విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో రాజధానిగా ఉమ్మడి హక్కులు ఉన్నాయన్నారు. ఇద్దరు సీఎంల మధ్య రహస్య ఒప్పందం ఉందేమోనని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
తెలుగు అకాడమి పేరు మార్పుపై మండిపాటు
రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని బ్రిటీష్ వారసులుగా పాలకులు వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి విమర్శించారు. ఈ అంశం ఇప్పటికే కోర్టులో ఉందన్నారు. తెలుగు అకాడమిని రద్దు చేసి ఖునీ చేసే ప్రయత్నాలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణలు తెలుగులో చదువుకొని వచ్చినవారేనని విష్ణువర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తెలుగు భాషను బలోపేతం చేసేందుకు కృషిచేయాలని హితవు పలికారు.