- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులా?
దిశ ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం అని బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాజుల శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతారా అని ప్రశ్నించారు. ఖమ్మం గోల్లపాడు ఛానల్లో సుమారు 1500 మంది పేదలను దౌర్జన్యంగా ఇల్లు ఖాళీ చేయించారన్నారు.
దీనికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ ప్రతాప్ చేపట్టడంతో, నిరసన దీక్షను అడ్డుకొని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బెదిరింపులకు బీజేపీ నాయకులు వెనక్కి తగ్గరన్న విషయం కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం రఘునాథపాలెం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.