- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేతల గృహనిర్బంధం.. అధ్యక్షుడి ఆగ్రహం
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి బీజేపీ నాయకులు శుక్రవారం ప్రగతి భవన్‌లోని సీఎం కేసీఆర్‌ను కలువడానికి సిద్ధమయ్యారు. ముందస్తుగా పసిగట్టిన పోలీసు అధికారులు సీఎం అపాయింట్‌మెంట్ లేదన్న కారణంతో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కే లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లను హౌస్ అరెస్టు చేశారు. ఇంటి నుంచి తప్పించుకోని భయటికి వచ్చిన ఎమ్మెల్సీ రాంచందర్‌రావును అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేష్టన్‌కు తరలించారు. బీజేపీ నాయకుల అరెస్టును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని విపక్ష పార్టీల నాయకులు కలిసి ప్రజా సమస్యలను పరిష్కరించమని కోరాడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమని గుర్తుచేశారు. అనేక నిరసన కార్యక్రమాలతో పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులను కలవడం సర్వసాధారణమన్నారు. కానీ, సీఎం కేసీఆర్ ఎవరికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం సమస్యలను ఎత్తితే దాడి చేయడం పరిపాటిగా మారిందని సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులు విపక్ష పార్టీల నేతలు కలుస్తామంటే అరెస్టు చేయడం గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ సీఎం కేసీఆర్ నిర్ణయాలను ఖండించాలని కోరారు. కరోనా విషయంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను మొదటి నుంచి ఎత్తి చూపుతుందన్నారు. ఇది ప్రజలను కాపాడడానికి తప్ప ఇంకొకటి కాదని స్పష్టం చేశారు. ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, అరెస్టులకు ఎదురు దాడులకు భయపడేది లేదన్నారు.
అనంతరం పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. విపక్ష పార్టీల నాయకులు సీఎంను కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ముందస్తుగా గృహనిర్బంధం అరెస్టు చేయడం నిరంకుశత్వానికి నిదర్శమన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు సీఎం కేసీఆర్ అవలంబించడం సరికాదని విమర్శించారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ఇకనైనా నిరంకుశ ధోరణి నియంతృత్వ పోకడలను విరమించుకుని విపక్ష పార్టీల నేతలను గౌరవించాలని సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యాన్ని, భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తుచేశారు. రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని హెచ్చరించారు.