‘ఎమ్మిగనూరు ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే’

by srinivas |
‘ఎమ్మిగనూరు ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే’
X

దిశ, ఏపీ బ్యూరో : హిందువులు దైవంగా భావించి..తల్లిగా పూజించే గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ దగ్గర జిల్లా బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు.

హిందూ ధర్మంపై దాడిని ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీమంత్రి శనక్కాయల అరుణ ఆరోపించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ప్రశాంతికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, తాళ్ల వెంకటేష్, మాగంటి సుధాకర్, జూపూడి రంగరాజు జిల్లా మహిళా మోర్చా, యువమోర్చా నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed