- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభ్యర్థి ఎవరైనా.. ఈటల VS కేసీఆర్ మధ్యే వార్ : వివేక్
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్‌లో ఈటలపై ఎవరు పోటీ చేసినా ఈటల వర్సెస్ కేసీఆర్ అన్న రీతిలోనే ఎన్నికలు జరుగుతాయని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి వివేకానంద అన్నారు. గురువారం హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు ముందు ఈటలపై సర్వే చేయించామని, ఆయనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్నారు. పాదయాత్రలో కూడా రాజేందర్‌కు మంగళ హారతులతో స్వాగతం పలికారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రోజురోజుకూ ఈటలపై ప్రజాదరణ పెరుగుతోందని, ఈటల బీజేపీలోకి పోడని కేసీఆర్ అనుకున్నాడు. కానీ ఈటల తీసుకున్న నిర్ణయంతో సీఎం అంచనాలు తలకిందులయ్యాయని వివేక్ వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరాక కేసీఆర్‌కు భయం పట్టుకుందని, సొంత నాయకులనే కొంటూ అక్రమంగా గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని, ప్రజల ప్రేమ ముందు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా లాభం లేదన్నారు. ఈటల గెలిస్తే ప్రజలకి లాభం జరుగుతుందని, హుజరాబాద్‌లో వచ్చిన ఇలాంటి పథకాలు రాష్ట్రం అంతట వచ్చి తీరుతాయని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి ఈటల వల్లే బయటకు వచ్చాడని, ఈటల రాజీనామా వల్లే హుజురాబాద్‌కు నిధుల వరద పారుతోందన్నారు. కొడుకులాంటి వాడు అన్న సుమన్‌ను గెలిపించినా చెన్నూరుకు ఏమీ చేయలేదని, తన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బాల్కసుమన్ ఇక్కడి కొచ్చి ప్రగల్భాలు పలుకుతుండటం విడ్డూరంగా ఉందన్నారు.
కొడుకు లాంటి వాడివి కదా.. ఎందుకు కేసీఆర్‌తో చెప్పి చెన్నూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం లేదో చెప్పాలని వివేక్ డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పిన హామీ ఏమైందో ప్రజలకు వివరించాలన్నారు. మోడీ రూ.8 వేల కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపించి 5 వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. గతంలో హరీష్ రావు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు ఫ్యాక్టరీ తెరిపించేందుకు వివేక్ ఎంతో కృషి చేశారని మెచ్చుకున్నారని వివరించారు. ఓట్లు ఉన్నప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన చేస్తాడు. ఆ తర్వాత మర్చిపోవడం అలవాటుగా మారిపోయిందని వివేక్ విమర్శించారు. ఏనాడు దళితుల కోసం మాట్లాడని కేసీఆర్.. ఇప్పుడు ఓట్ల కోసం దళిత బంధు తెచ్చాడని, దళితులపై ప్రేమ ఉంటే రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా తన కొడుకు కాదు. దళితుడే అని కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గెల్లు శ్రీనివాస్‌కు 2 గుంటలు, ఈటలకు 200 ఎకరాలు ఉన్నాయని హరీష్ రావు అనడం హస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.
ఈటల కష్టపడి సంపాదించుకున్న భూములని వివేక్ స్పష్టం చేశారు.